మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గుర్రం రమాదేవి
స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 3వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గుర్రం రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు.ఈ సందర్భంగా గుర్రం రమాదేవి మాట్లాడుతూ, డివిజన్ సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.అభ్యర్థికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. నమూనా బ్యాలెట్ పత్రాలను పంచుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది.పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.