మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇటీవల మరణించిన మూడు కుటుంబాలను మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పరామర్శించారు.వర్ధన్నపేట కేంద్రానికి చెందిన ప్రముఖ ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు శ్రీరాం రమేష్ గుండెపోటుతో మరణించగా,వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చందు మల్లయ్య, శ్రీను, సంతోష్ తండ్రి చందు ఐలయ్య యాదవ్ ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బుర్ర రాజ్ కుమార్ తండ్రి సారలయ్య మరణించగా,వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.