సీనియర్ జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది-ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ శ్రీరాం రమేష్ గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకుని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేఆర్ దిలీప్ శ్రీరామ్ రమేష్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన శ్రీరాం రమేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,పి ఏ సి ఎస్ చైర్మన్ కౌడగని రాజేష్ కన్నా, సర్పంచ్ చిటూరీ రాజు,కౌన్సిలర్ సిరిపెల్లి వాణి కుమార్,కొత్తపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపెల్లి యాదగిరి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు మల్లెపాక సమ్మయ్య,తుళ్ల రవి, సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్,ఎండీ చోటే,ఈగ దామోదర్,సమ్మెట సుధీర్,టెంపుల్ డైరెక్టర్ ఖీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.