రామవరం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలుగు గళం న్యూస్ నర్సంపేట/రామవరం జూన్ 2
నర్సంపేట మండలం రామవరం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు టిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ కోడారీ రవి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా పురస్కరించుకొని గ్రామం ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోడారీ రవి మాట్లాడుతూ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాట స్ఫూర్తి, విద్యార్థుల అంకితభావం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆశయాలను సాకారం చేయడం మనందరి బాధ్యత. అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, స్వాభిమానానికి ప్రతీకగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొడాలి రవి గ్రామ పార్టీ అధ్యక్షులు జిలకల విజేందర్ వీరెల్లి సాంబయ్య ఆరెపల్లి రాజేందర్ శనిగరం సురేష్ గోన బిక్షపతి మండల నాయకులు జింకల అఖిల్ గోనె సాంబయ్య రంజిత్ జనకల ప్రకాష్ నాగరాజు జనగల కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు