రైతులకు వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం
రేగొండ మండలంలోని రావులపల్లి గ్రామంలో రైతులకు పంట సంరక్షణ, కలుపు నివారణ మరియు పురుగు నియంత్రణపై బేర్ కంపెనీ వారు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బేయర్ కంపెనీ టెరిటరీ మేనేజర్ శివేష్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ రమణ రెడ్డి హాజరై రైతులతో ప్రత్యక్షంగా చర్చించి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తుల వినియోగంపై సమగ్ర వివరాలు అందించారు.ఈ సందర్భంగా వారు బికోటా, వయాగో, కౌన్సిల్ యాక్టివ్ వంటి ఉత్పత్తుల ప్రయోజనాలు,ఉపయోగించే విధానం, మోతాదులు, జాగ్రత్తలు తదితర అంశాలను వివరించారు.కౌన్సిల్ యాక్టివ్ గడ్డి మందుగా ఉపయోగపడుతుందని,పంటల్లో కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించి పంటలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందేలా చేస్తుందని తెలిపారు.వయాగో పురుగు మందుగా పంటల ప్రారంభ దశలోనే రక్షణ కల్పించి ముగిపురుగుల వంటి హానికర కీటకాలను నియంత్రించడంలో సహాయపడుతుందని వివరించారు.బికోటా గులికలు పంటల్లో అధిక పిలకలు రావడానికి, వేర్ల వ్యవస్థ బలపడటానికి, మొక్కల పెరుగుదల మెరుగుపడటానికి ఉపయోగపడతాయని తెలిపారు. సరైన విధానంలో వినియోగిస్తే దిగుబడి పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు.రైతులు తమ పంటల్లో ఎదురవుతున్న సమస్యలను అధికారుల ముందుంచి చర్చించారు. పంట దశను బట్టి మందుల వినియోగం ఎలా ఉండాలి, ఎప్పుడు వాడాలి, ఏ మోతాదులో వాడాలి వంటి అంశాలపై అధికారులు స్పష్టమైన సూచనలు అందించారు. రసాయనాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, సూచించిన మోతాదును మించకుండా వాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామానికి చెందిన రైతులు గండ్రెడ్డి లింగారెడ్డి,రాజిరెడ్డి,గూటం మాధవరెడ్డి,అన్నారపు వెంకట్రెడ్డి,మందల మల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, అన్నారపు రాజు, వంగ రాజయ్య, వంగ శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు కార్యక్రమాన్ని ఉపయోగకరంగా అభిప్రాయపడి భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కోరారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో రైతులు మెరుగైన దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని అధికారులు తెలిపారు