
ఈ69న్యూస్ వరంగల్ ఏప్రిల్ 25
దేశాయిపేట సీకేఎం కాలేజీ సమీపంలోని పోచమ్మ దేవాలయం వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శనివారం ఉదయం 06:21 గంటలకు డయల్-100కు సమాచారం అందడంతో ఇంతేజార్ గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు సుమారు 28 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండగా, సుమారు 5.7 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఎరుపు వర్ణంతో, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.అయితే అతని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో వ్యక్తి వివరాలు తెలియరాలేదు.ప్రాథమికంగా ఆకలి, దాహం లేదా ఇతర అనారోగ్య కారణాలతో మృతి సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తింపు కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.