సూర్యాపేట న్యూస్ suryapet news todayసూర్యాపేట న్యూస్ suryapet news today

మండలంలోని రామాపురం గ్రామంలో కోర్ కార్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,స్వామి వివేకానంద గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ ఆవరణం లో గ్రామ సర్పంచ్ గుజ్జా అనసూర్యమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశం లో రైతులకు
వరి లో తడి, పొడి విధానం పై అవగాహన కల్పించారు. ఈ సమావేశంకు సీసీఎక్స్ ప్రతినిధి రాజేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రైతులు అధికంగా పండించే వరిలో నీళ్లు ఎక్కువ గా నిల్వ ఉంచడం వల్ల మీథెన్ అనే విషవాయువు ఉత్పన్నమై వాతావరణ మార్పు జరుగుతుందని అదేవిదంగా దోమకాటు, ఊసరోగం, ఆకులు తెలుపు బారిన పడటం జరుగుతుందని,ఇలాంటి రోగాల నివారణ పై, రైతులకు అవగాహన కల్పించారు. తడి-పొడి విధానంలో పంట సాగు చేయడం వలన జరిగే లాభాలను వివరించారు.ఈకార్య క్రమంలో మండల కో-ఆర్డినేటర్ పులి లక్ష్మణ్, కోదాడ సూపర్వైజర్ కె. సుధాకర్ రెడ్డి, పి ఏ సి ఎస్ డైరెక్టర్ కోటిరెడ్డి,వీరాంజనేయులు,రైతులు శ్రీనివాస రెడ్డి, నరసింహారావు,రామిరెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News