జాతీయ-బీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
•అంబేద్కర్ విగ్రహానికి నివాళులు, జాతీయ-బీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 2
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణం అని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎందరో అమరవీరులు త్యాగాలు చేశారు.వారి సేవలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. యువత,విద్యార్థులు,రైతులు, ఉద్యోగుల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలి,అని ఆకాంక్షించారు.సుదీర్ఘ ఉద్యమంలో ఎందరో అమరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఆగమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పరిరక్షణ కోసం ప్రతి తెలంగాణ బిడ్డ పునరంకితం కావాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మార్గం బిక్షపతి,ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు తుల్ల కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు మధు, మాజీ మార్కెట్ చైర్మన్ గుజ్జ గోపాల్ రావు, గుజ్జ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు గుజ్జ వీర రాఘవరావు, సిరివేలు కుమారస్వామి,మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏరుకొండ వేణుగోపాల్ రావు, పిట్టల రాజు, పొట్లపెల్లి కృష్ణ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు