వర్ధన్నపేట 2వ వార్డులో తీరిన నీటి కష్టాలు.. సొంత ఖర్చుతో కౌన్సిలర్ చొరవ
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మున్సిపాలిటీ 2వ వార్డు ప్రజల నీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.గత నాలుగు నెలలుగా నీటి సరఫరా సరిగా లేక ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజల విన్నపం మేరకు స్థానిక కౌన్సిలర్ బానోత్ జ్యోతి-నవీన్ యుద్ధ ప్రాతిపదికన స్పందించి సొంత ఖర్చులతో సమస్యను పరిష్కరించారు.బీఆర్ఎస్ కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, సిలువేరు కుమారస్వామి యాదవ్, తిరుపతి సురేష్, చిలువేరు రమ-రాజశేఖర్ యాదవ్, తుమ్మల అరుణ-శ్రీధర్ సహకారంతో వెంటనే రంగంలోకి దిగిన కౌన్సిలర్ జ్యోతి-నవీన్ మున్సిపల్ ఏఈతో మాట్లాడి వాటర్ ట్యాంక్ వద్ద పాడైన గేట్ వాల్వ్‌ను మార్పించడంతో పాటు ఇతర సాంకేతిక లోపాలను సరిచేయించారు.వేసవిలో ఉపశమనం మండుతున్న ఎండల కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవడంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మేరుగు రాజేష్, గుడిబోయిన సంతోష్,తగరాల విష్ణురావు,మున్సిపల్ సిబ్బంది చల్ల వెంకన్న మరియు వార్డు ప్రజలు పాల్గొని అధికారులకు,కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు.