విశ్వశాంతి విద్యార్థికి ఎమ్మెల్యే అభినందనలు
విద్యార్థుల కృషికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం తోడైతే వారు అద్భుత ఫలితాలు సాధిస్తారని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 97 వేలమంది పాల్గొన్న పాలీసెట్ ఎంట్రన్స్ పరీక్షలో
ఎండి. మహబూబ్అర్ఫాజ్ అలీ ( విశ్వశాంతి స్కూల్, సత్తుపల్లి ) కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ (120/120 మార్కులు ) రావటం సత్తుపల్లి కి గర్వకారణం అన్నారు .ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారంస్థానిక ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ ,సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎండి. రెహానా బేగం కమల్ పాషా , సత్తుపల్లి సహకార సంఘ అధ్యక్షులు చల్లగుళ్ల కృష్ణయ్య లు అర్ఫాజ్ కు స్వీట్లు తినిపించి, శాలువా, పుష్పగుచ్చంతో
అభినందించారు.ఈ సందర్భంగా
ఎమ్యల్యే మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాలలో తొలిసారిగాసత్తుపల్లి కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఆనందంగా ఉందన్నారు. సత్తుపల్లి సత్తా చాటిన అర్ఫాజ్ అలీతో పాటు , అతని తల్లిదండ్రులను, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను
అభినందించారు.అర్ఫాజ్ అలీ మాట్లాడుతూ…పోటీ పరీక్షలకు విశ్వశాంతి విద్యార్థులు పాల్గొనేలా తమ టీచర్లు ప్రోత్సహించడం వలన
పాల్గొన్న ప్రతి పోటీ పరీక్షలో ఏదో ఒక ప్రైజ్ సాధించటం జరుగుతుందని అన్నాడు.విశ్వశాంతి యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ లు మాట్లాడుతూ…మార్కులు, ర్యాంకులు మాత్రమే ధ్యేయంగా కాకుండా
విశ్వశాంతి లో విద్యార్థులకు
సబ్జెక్టు పట్ల అవగాహన
కల్పిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి తండ్రి అఫ్జల్ మాట్లాడుతూ…టీచర్ల సహకారంతో తన కుమారుడికి ఎస్ఎస్సి లో 573 మార్కులు,పాలిసెట్లో ఎంపీసీలో 30 /30 మ్యాథ్స్ లో 60/60, ఫిజిక్స్ లో 30/30,కెమిస్ట్రీలో 30/30 ( మొత్తంగా120/120) మార్కులు
సాధించినట్లుతెలిపారు.యంబైపిసి లో ఆరవ ర్యాంక్ సాధించడం జరిగింది అన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనీల్, అవినాష్, క్రిస్టఫర్,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.