వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
మరిపెడ ఎస్సై వీరభద్రరావు
హెల్మెట్ ధరించి ప్రయాణించే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుండి రక్షణ పొంది,సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని మరిపెడ ఎస్సై వీరభద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాలనుసారం మండలంలోని ఉల్లెపల్లి, తాళ్ళఊకల్, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వ వార్డుల్లో 100% హెల్మెట్ ధరించి ప్రయాణించేలా మరిపెడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ప్రయాణించే వారికి ఎస్సై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి సంవత్సరం చాలామంది వాహనదారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగా మరణిస్తున్నారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం రహదారి ప్రమాదాలలో తలకు తీవ్ర గాయాలపాలై ‘గోల్డెన్ అవర్స్” లో చికిత్స అందక విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకుని కుటుంబానికి భరోసా కల్పించేలా రక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.