సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు. విచారణ గురువులు ఫాదర్ తంబీ (సీపీపీఎస్) మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అపారమైన సహనం, అవధులు లేని త్యాగం వంటి విలువలను యేసు ప్రపంచానికి అందించారని తెలిపారు. శుభ శుక్రవారం యేసు మహా త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దీక్ష బిడ్డలు, మరియదల సభ్యులు, యువతీ యువకులు, ఉపదేశికులు పాల్గొన్నారు. విచారణ పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
వేంసూరు మండలం వెంకటాపురంలో శుభ శుక్రవారం సందర్భంగా శుక్రవారం బహిరంగంగా సిలువ మార్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.
విచారణ గురువులు ఫాదర్ తంబీ (సీపీపీఎస్) మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఆదర్శమని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, అపారమైన సహనం, అవధులు లేని త్యాగం వంటి విలువలను యేసు ప్రపంచానికి అందించారని తెలిపారు. శుభ శుక్రవారం యేసు మహా త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో దీక్ష బిడ్డలు, మరియదల సభ్యులు, యువతీ యువకులు, ఉపదేశికులు పాల్గొన్నారు. విచారణ పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సిలువ మార్గాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.