మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ప్రసిద్ధ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఉదయం వేళల నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు సంప్రదాయ శైవ ఆగమ విధానాల ప్రకారం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.శివపార్వతుల కల్యాణాన్ని సూచించే పూజా క్రమంలో కలశస్థాపన,మంగళవాద్యాలు,మంగళహారతి వంటి కార్యక్రమాలు నిర్వహించగా, కలెక్టర్ దంపతులు, వారి తల్లిదండ్రులు, భక్తులు భక్తి భావంతో తిలకించారు.అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం ప్రజల జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర సందర్భమని తెలిపారు.శివపార్వతుల దివ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ శాంతి, సంతోషం,ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం కొనసాగించాలని, అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని సురక్షిత త్రాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా అందించాలని స్పష్టంగా సూచించారు.మహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా,శివనామసంకీర్తనలు, భక్తి గీతాలతో పరిసరాలు మార్మోగాయి.జాతరకు విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు,క్యూలైన్ నిర్వహణ,భద్రతా ఏర్పాట్లు,వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేశారు.మహా శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా,ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు