సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు
ఖమ్మం జిల్లా కార్మికాదికారి గా ఆ సారొచ్చారు నిజానికి పట్టం గడుతున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.ఇక వివరాలలోకి వెళితే లేబర్ కార్డులు పేరుతో,తెల్ల రేషన్ కార్డులు ఉంటే చాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టంలో సంబంధం లేని వారిని బ్రోకర్లు చేర్పిస్తూ దందా చేస్తున్నారు.అయితే ఈ లోపం చేయడానికి గత పాలకులు చేసిన పాపం లేక పోలేదు ఉపాధిహామీ కార్డులు ఉన్నవారు కూడా నమోదు చేసుకోవడానికి అర్హులే అని ప్రకటించి అవకాశం ఇవ్వడం,కార్మిక శాఖ లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడం,సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాల నాయకులతో కలిపి ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటి రద్దు చేయడం ఒక వరంగా కొందరు కార్మికాధికారులకు,ఉద్యోగులకు,బ్రోకర్లకు మారింది.
నిజమైన కార్మికులకు శాపంగా మారింది.అసలు సంగతేమిటంటే ఈ చట్టం ఏర్పాటు కోసం సీఐటీయూ వామపక్ష కార్మిక సంఘం ఎన్నో ఏళ్లుగా గల్లీ నుండి డిల్లీ దాకా పోరాటాలు చేసింది.ఆ నేతలపై కేసులు నమోదు కావడం జైళ్లు పాలవడం జరిగింది.వీటి పర్యవసానంగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై ఎస్ ఆర్ ఉన్నపుడు ముందుకొచ్చి 1995 కేంద్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టాన్ని అనుసరిస్తూ బోర్డును,అడ్వైజరీ కమిటి ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందించారు.ఈ చట్టంలో పేరు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుని కుమార్తె ల,కార్మికురాళ్ల వివాహా సమయంలో,ప్రసవ సమయంలో ముప్పయి వేలు చొప్పున ఆర్థిక సాయం,సహజ మరణం చెందినప్పుడు అంత్యక్రియల సహాయంతో కలిపి రెండు లక్షల రూపాయల సాయం,ప్రమాద మరణం సంభవిస్తే పది లక్షల రూపాయల సాయం అందిస్తారు.అయితే కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు, లేక నేరుగా కార్మికులే తమ పేర్లు నమోదు చేసుకుంటే విచారణ జరిపి గుర్తింపు కార్డులు ఇచ్చే పూర్తి అధికారాలు సహాయ కార్మికాధికారులకు అప్పగించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కానీ వారిని చేర్పించి వారి నుండి అదనపు కాసులు కాజేస్తూ జీవిస్తున్న బ్రోకర్లకు వరంగా ఈ పథకం ఉంది.దానిని రూపుమాపీ చట్టంలో ఉన్న నిజాన్ని అమలు చేయడం కోసం ప్రక్షాళన దిశగా ఖమ్మంజిల్లా ఉప కార్మికశాఖాదికారిగా ఇటీవల వచ్చిన విజయభాస్కర్ రెడ్డి ప్రయాణం కార్మిక సంఘాలకు స్వీట్ గా బ్రోకర్లకు హాట్ గా ఉంది గురు అనే చర్చ జిల్లాలో జరుగుతుంది.గబ్బర్ సింగ్ సినిమా లో పవన్ కళ్యాణ్ చట్టాలు ఎలా అయితే ఉంటాయో,ఇక్కడ కూడా ఈ గబ్బర్ సింగ్ ఆఫీసర్ నిజాన్ని వెలికితీసి నిజమైన కార్మికులకు అండగా ఉండటం కోసం ఆయన రూటే సపరేటు అనేది అగుపిస్తుంది.చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ఎవరు చెప్పినా ఎటువంటి పైరవీలు చేసినా తానొక శoడశాశనుడులా వినకుండా నిర్మొహమాటంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అమలులో జిల్లాలో జరిగే అవినీతిని అరికట్టడానికి అవిశ్రాంత శ్రమ చేయడమే పరమావధిగా దూసుకెళ్తున్నారు.తనదైన శైలిలో క్లైమ్ ల దరఖాస్తులను ఎంక్వయిరీలు చేస్తూ అనుమానం ఉన్నవారిని తేదీ నిర్ణయించి తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పిలిచి దరఖాస్తు దారుల నుండి నిజాలు రాబడుతున్నారు.అయితే ఇలా చేయాలని చట్టంలో లేదు రాష్టంలో ఏ జిల్లాలో లేదు కేవలం ఖమ్మం అడ్డాలో ఈ గబ్బర్ సింగ్ ఆఫీసర్ విచారణలు చేస్తున్నారు.దీంతో బ్రోకర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి.త్వరగా రిటైర్ లేక ట్రాన్స్ఫర్ అయితే బాగుండు అని దేవుళ్లకు నొక్కుతున్నారు కొందరు పైరవీకారులు.ఇక పోతే ఈ విజయ భాస్కరుడు శస్త్రాలు తెలుసుకుందాం ఎంతో గమ్మత్తుగా ఉంటాయి మరి.మీసేవ కేంద్రాల ద్వారా పేర్లు నమోదు చేసుకున్నాక ఆమోదించకుండా విచారణ చేసి ఫేక్ వాళ్ళను నమోదు కాకుండా చూస్తున్నారు, వివాహా సహాయం కోసమో,ప్రసవ సాయం కోసమో,మరణ సహాయాల కోసమో దరఖాస్తులు చేసిన క్లిమ్ ల లో చట్టంలో పొందు పరచాలని లేనప్పటికీ ఈ శ్రమ కార్డు నకలు,సహాయం కోసం ఇస్తున్న బ్యాంక్ ఖాతాకు చెందిన స్టేట్ మెంట్ ఏడాది కాలం వెనకది పొందు పరచాలని,ఎక్కువ లావాదేవీలు జరిగితే విచారణకు పిలిచి వాటిపై విచారణలు చేస్తూ నిజాన్ని వెలికి తీస్తున్నారు అక్కడితో ఆగకుండా పేరు నమోదు సమయంలో ఫామ్ 27 లో ఏ బ్యాంక్ ఖాతా పొందు పరిచారో అట్టి ఖాతా మాత్రమే క్లైమ్ సమయంలో వాడాలని వేరేది వాడితే వివరణ ఇవ్వాలని,పాతది మురిగిపోతే బ్యాంక్ నుండి లెటర్ తేవాలని,మేస్త్రి సర్టిఫికెట్ లు తేవాలని, ఏ యూనియన్ లో ఉన్నారో ఆ యూనియన్ సభ్యత్వాలు తేవాలని చిక్కు ముడులు పెడుతూ తమదైన శైలిలో విచారణలు చేస్తున్నారు.అయితే నిజమైన కార్మికులకు న్యాయం చేయడం కోసం అందరి లా నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది సమయానికి వచ్చి వెళ్ళిపోయి కాలం గడుపుదాం అని కాకుండా పని చేస్తున్నప్పటికీ ఓ విషయంలో నిజమైన కార్మికుల నుండి,కార్మిక సంఘాల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతుంది.అదేమిటంటే ఫారం 27 లో పొందుపరిచిన బ్యాంక్ ఖాతా పెట్టాలనే నిబంధన కొంత ఇబ్బంది పెడుతుందని కార్మికులకు పల్లెల్లో ఎంతో కొంత సాగు భూమి ఉంటుందని తాను పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు అమ్మిన సమయంలో అట్టి సొమ్మును సివిల్ సప్లై నుండి బ్యాంక్ ఖాతాలలో జమ అయ్యాయని అటువంటి వాటిని,అంతే కాకుండా నిర్మాణ రంగ పని లేని సమయంలో ఇతర పనులు చేస్తే వాటినీ తెలుసుకొని సహాయాలు మంజూరు చేయకుండా మొండిగా వ్యవహరించడం సిన్సియర్ గా పని చేసే అధికారికి సరి కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే మరో నూతన స్టైల్ లో విచారణ చేయబోతున్నారనేది తెలుస్తోంది మఫ్టీలో జిల్లాలో కార్మిక కార్యాలయాలకు వెళ్ళి జరుగుతున్న బ్రోకర్ల ముడుపుల విధానoపై,క్లైమ్ లకు దరఖాస్తులు చేసిన వారి గ్రామాలకు వెళ్లి విచారణ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది.