సొంత ఖర్చులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం
వైరా మండల పరిధిలోని కనకగిరి సిరిపురం గ్రామంలో
గ్రామ వాసి షేక్ లతీఫ్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవం వైరా ఎస్సై పుష్పాల రామారావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రామారావు లతీఫ్ చేస్తున్న సేవలను అభినందించారు.
గత 6 సంవత్సరాలుగా వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడంలో లతీఫ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రెగ్నెంట్ స్త్రీలను ఉచితంగా హాస్పిటల్ కు తన ఆటోలో తీసుకుపోవడం, తీసుకురావడం చాలా గొప్ప విషయమని అన్నారు.
సేవ చేయాలన్న తపన, సహాయం చేసే గుణం ఉండాలి కానీ ధనవంతులే అవసరం లేదని, తనకున్న కొద్ది మొత్తంలో రోజువారి సంపాదనలో కొంత భాగం పేద ప్రజల అవసరాలు తీర్చడానికి ఉపయోగ ఉపయోగించడం గొప్ప విషయం అన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజును ప్రతి సంవత్సరం తానే స్వయంగా చెల్లించడం ఆయన సేవా తత్పరతకు నిదర్శనమన్నారు.పేద విద్యార్థుల అవసరాలను తీర్చడం, వారి విద్యా సంబంధ కార్యక్రమాలకు సహకరించడం ఇతరులకు ఆదర్శనీయమైనది అన్నారు. అనేక ఇతర సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల కలలో నాలుకల షేక్ లతీఫ్ నేటి యువతకు ఆదర్శం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధులుగా గ్రామ సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ కవి, రచయిత ఐనాల సైదులు,ఉప సర్పంచ్ జంగా పుష్పావతి, వాకదాని శ్రీనివాసరావు, షేక్ సైదా, దుప్పటి కృష్ణారావు, హిమాం పాషా, మౌలాలి, తాటి వెంకటేశ్వర్లు, షేక్ జమీల్, నార పోగు తిరుపతిరావు, బొడ్డు హుస్సేన్ ,హరీష్ ,అశోక్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.