


ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 24
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మండలంలోని వ్యవసాయ ఇన్పుట్ డీలర్ల దుకాణాలపై టాస్క్ఫోర్స్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. మండల రెవెన్యూ అధికారి స్వప్న, మండల వ్యవసాయ అధికారి చంద్రన్ కుమార్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నిల్వలు, లైసెన్సులు, విక్రయ రికార్డులను అధికారులు సవివరంగా పరిశీలించారు.రైతులకు నాణ్యమైన ఇన్పుట్లు అందేలా ప్రభుత్వం విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డీలర్లకు స్పష్టం చేశారు.దుకాణం వద్ద లైసెన్సులను ప్రదర్శించడం, స్టాక్ బోర్డును నిరంతరం నవీకరించడం, స్టాక్ రిజిస్టర్లను ప్రతిరోజూ నమోదు చేయడం, ఈ-పోస్ వివరాలకు భౌతిక నిల్వ సరిపోల్చడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.ప్రతి విక్రయానికి బిల్లు ఇవ్వాలని, ఎమ్ఆర్పీ ధరలకే ఉత్పత్తులను విక్రయించాలని ఆదేశించారు.గడువు ముగిసిన లేదా నాసిరకం ఉత్పత్తులను విక్రయిస్తే, రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.రైతులకు సమయానికి నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్లు అందించేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.