స్ ఐ ఆర్ ఓటర్ నమోదులో కల్లెడ 100%-అధికారులకు సన్మానం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఎస్ ఐ ఆర్ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాలలో మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి పాల్గొన్నారు.కల్లెడ గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసిన అధికారులను,పార్టీ బి ఎల్ ఓ లను సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ తో కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి సన్మానించారు.అన్నారం షరీఫ్ గ్రామంలో సర్ సర్వే ప్రక్రియను ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ గొడుగు బిక్షపతి, గ్రామ సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్,ఎ ఎం సి డైరెక్టర్ గొడుగు బిక్షపతి,జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బోట్ల మహేంద్ర,గ్రామ పార్టీ అధ్యక్షుడు గొడుగు రమేష్,యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్,సీనియర్ నాయకుడు మోటపోతుల సారంగపాణి,గ్రామ వార్డు సభ్యులు రాపోలు అనిత రవీందర్,గాడి పెళ్లి రాజబాబు,నాయకులు ఈరగాని అఖిల్,మాజీ సర్పంచ్ మునుకుంట్ల యశోద బాబు,రామ్మూర్తి, యాకయ్య,మహేందర్,జంగాల దయాకర్,మైసయ్య,సంపత్, వెంకన్న మరియు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.