మన నినాదం ఒక్కటే మేమెంతో మాకు అంత
మరిపెడ గళం న్యూస్.
ముదిరాజ్ యువసేన జిల్లా కార్యదర్శి సూరబోయిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రేపు తలపెట్టిన ముదిరాజ్ సింహ గర్జన చైతన్య ర్యాలీ సందర్భంగా మన గ్రామం తరపున వందల మందిగా తరలి మా యొక్క హక్కుల సాధన కై జనాభా ప్రాతిపాదికన మన ముదిరాజులకు దక్కవలసిన చట్టసభల్లో, రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉండి, అన్ని రంగాలలో వెనుకబాటుకు ఈ రాజకీయ పార్టీలు ముదిరాజ్ కుల వ్యవస్థను చిన్నచూపు చూస్తున్నాయి, కావలసిన రిజర్వేషన్లు, బి సి డి నుండి బీసీ ఎ లోకి మార్చాలని, డిమాండ్ చేస్తూ, మేము ఎంతో మాకు అంత, అనే నినాదంతో కలం తొక్కుతూ, పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని మన ముదిరాజ్ సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చెంపచెట్టు లాగా సమాధానం కావాలి,ఓట్లు మనవి, సీట్లు వాళ్లకు, మనం ఎప్పుడు ఓట్లు వేసుకుంటూనే పోదామా, మనకు వద్ద అన్ని రంగాలలో ప్రాధాన్యత కావాలి, అప్పుడే మన ముదిరాజ్ వ్యవస్థ ముందుకు నడుస్తుంది,ఓ ముదిరాజ్ సోదరుడా ఇప్పటికైనా మేలుకో, లేకపోతే బానిస లాగానే బతకవలసి వస్తుంది. ముందు తరాల పిల్లల భవిష్యత్తుపై ప్రతి ముదిరాజ్ బిడ్డ తనవంతుగా రేపు జరగబోయే చలో గజ్వేల్ ముదిరాజుల సింహగర్జన చైతన్యరాలికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి