17 వార్డులో తులసి గెలుపు జెండా ఎగర వేయనున్నార?
ప్రచారం ముగింపు సందర్భంగా మేళతాళాలతో గడప గడపకు ఉమా తులసీ ల విన్నూత్న ప్రచారం”
నన్ను గెలిపిస్తే మీ గొంతుకునై గళం విప్పుతా”
కొత్తూరు కుటుంబం అంటే ప్రజా సేవకు మారుపేరు”
వ్యాపార రంగంలో నిజాయతీ కలిగిన వ్యక్తిగా ఉమా కు గుర్తింపు” తులసీ గెలుపుకు దోహదం”
ఆర్యవైశ్యుల,బీసీ ల ఓట్లే కీలకం”
ఈ నెల 11 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణ పుర పోరులో 17 వార్డు లో కొత్తూరు ఉమామహేశ్వరరావు సతీమణి తులసీ గెలుపు జెండా ఎగర వేయనున్నార అనేది పట్టణంలో చర్చగా మారింది.అయితే కొత్తూరు కుటుంబం అంటే ఆనతి కాలం నుండి ప్రజా సేవకు అంకితం అనే నానుడి బాహాటంగా పాఠకులకు తెలిసిన విషయమే.నాడు గ్రామ పంచాయతీగా సత్తుపల్లి ఉన్ననాటి నుండి కొత్తూరు నరసింహం,కొత్తూరు సుబ్బారావు ల కుటుంబం రాజకీయాలలో తమదైన శైలిలో చక్రం తిప్పే సామర్థ్యం ఉంది.తమను నమ్ముకున్న వారికి అండగా ఉంటూ సుపరిపాలన అందించే వ్యక్తిత్వం,రాజకీయ బేధాలు చూడకుండా అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప వైశ్యుల కుటుంబంగా కొత్తూరు కుటుంబాలకు చరిత్ర ఉంది.అంతే కాకుండా చిట్స్,ఫైనాన్స్ వ్యాపార రంగంలో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టీ చాలామంది ఐపీ దాఖలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఆ తరుణంలో చిట్స్, ఫైనాన్స్ వ్యాపారoలో దానికి భిన్నంగా కొత్తూరు చిట్స్ స్థాపించి సుమారు 30 ఏళ్లుగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఘనత కొత్తూరు ఉమామహేశ్వరరావు కు ఉండడంలో ఎటువంటి సందేహం లేదు.వ్యాపార రంగంలో నిజాయతీ కు నిలువుటద్దంగా నాటి నుండి నేటి వరకు ప్రజల మనసులలో చెరగని ముద్ర కొత్తూరు ఉమామహేశ్వరరావు ఏర్పాటు చేసుకున్నారు.గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఉమామహేశ్వరరావు కౌన్సిలర్ గా గెలుపొంది ప్రజాబివృద్ధికి పాటు పడిన నేపథ్యం ఉంది.అంతే కాకుండా ఖమ్మం జిల్లాలో నిద్రావస్థలో ఉన్న గ్రంథాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసి గ్రంథాలయాలకు విద్యార్థులు,పాఠకులు విరివిగా వచ్చేలా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పని చేసిన విశిష్టత ఉమా మహేశ్వరరావు కు ఉంది.రమారమి ఇవన్నీ కూడా తులసీ గెలుపుకు అత్యంత దోహదం చేస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు నోట తెలుగుగళం జాతీయ దినపత్రిక ఆర్సీ మల్లూరు చంద్రశేఖర్ చేసిన సర్వేలో వెల్లడైంది.సోమవారం ప్రచారం ముగిoపు సందర్భంగా కొత్తూరు తులసీ ఉమామహేశ్వరరావు విన్నూత్న పద్ధతిలో మేళ తాళాలతో గడప గడపకు వెళ్ళి ఓటర్లను అప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని ఓట్లను అభ్యర్థించారు.మహిళా ఓటర్లకు హిందూ సంప్రదాయ పద్ధతిలో తమ గుర్తు కారు కు ఓటేయాలని బొట్టు పెట్టీ మరి అభ్యర్థించారు.నన్ను గెలిపిస్తే మీ గొంతుకునై ప్రభుత్వంపై గళం విప్పుతానని స్థానికంగా ఉంటూ సుపరిపాలన అందించే దానికి కృషి చేస్తానని తులసీ ఓటర్లకు స్పష్టమైన హామీ ఇచ్చారు.ప్రధానంగా చూస్తే తులసీ గెలుపుకు వార్డులో ఆర్యవైశ్యుల,బీసీ ల ఓట్లే కీలకంగా ఉన్నట్లు సర్వేలో స్పష్టంగా వెల్లడైంది.తాము గెలిచే వున్నామని ప్రజల ఆశీర్వాదాలు తనకు మెండుగా ఉన్నాయని కేసీఆర్ నాయకత్వంలో గతంలో పట్టణంలో చేసిన అబివృద్ధియే తన గెలుపుకు బాసటగా ఉందని మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమంలో: కొత్తూరు విజయ్,కొత్తూరు శారద,వెంకట సత్యనారాయణ,దారా మల్లికార్జున రావు,బాబు,పూర్ణ,వనమా నరేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.