20,21,22,23 వ వార్డ్ లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తధ్యం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 20 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ కమల్ పాషా మరియు 21 వ వార్డ్ అభ్యర్థి మహమ్మద్ రెహనా బేగం కమల్ పాషా మరియు 22 వ వార్డ్ అభ్యర్థి మందపాటి ప్రభాకర్ రెడ్డి మరియు 23 వ వార్డ్ అభ్యర్థి విరివాడ అపర్ణ నాగభూషణం ల గెలుపును కాంక్షిస్తూ ఇంటి, ఇంటి ప్రచారం మరియు రోడ్ షో లో సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ చైర్మన్ మువ్వా విజయ్ బాబు లు పాల్గొని పాదయాత్ర ద్వారా ఓటర్లకు నమస్కారం చేస్తూ హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభివాదం చేశారు.వీరిద్దరి రాకతో పుర పోరు ప్రచారంలో వేడి పుట్టింది.రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రచారం చేశారు.