నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం!నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం!

యుగాలు దాటొచ్చిన మనిషిని
మృగాలుగా మార్చింది ఎవ్వడు ?

పాలిచ్చిన అమ్మల రొమ్ములను
బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి
ఊతమిచ్చింది ఎవ్వడు ?

వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ?
విధ్వేషాన్ని రక్తనాళాలలోకి
ఎక్కించింది ఎవ్వడు?
తల్లుల జననాంగాల మీద తాండవ మాడిన
గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ?

నెత్తురుని మరిగించింది ఎవ్వడు ?
కత్తులను నూరించింది ఎవ్వడు ?
పరమత ఆలయాలను కూల్చింది ఎవ్వడు?
ఉసురు తీసి ఉత్సవం చేసింది ఎవ్వడు ?

మంటలను రాజేసింది ఎవ్వడు ?
గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు ?

మదమెక్కి ఆడబిడ్డలపై మానభంగం చేసిన
మతోన్మాద మూకలకు నూకలు
ఇస్తున్నది ఎవ్వడు?

పాకలు వేసి “భక్షణ శిక్షణ”
అందిస్తున్నది ఎవ్వడు ?

ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది ?
ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది ?
మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది ?

పచ్చని గసగసాల పైరు కొండల
మణిపూర్ కన్నుల కుండల నిండా
మరిగే వెచ్చిని నీరును నింపుతున్నది ?

వాడు….! వాడెవడంటే….!!

ఛాందస పీఠంపై పీటలు వేసుకొని
మౌడ్య సిరా చుక్కలను
మౌన కలంలోకి ఒంపుకొని
రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.
మన జీవన గమనాలను శాసిస్తున్నాడు.

అయితే….. !
ఇప్పుడు వాడు అనుకుంటున్నట్టు …!!

మణిపూర్ నడి వీధుల్లో నగ్నంగా నడిచింది దేహం కాదు………‌ “అది దేశం”.

పాశవిక అత్యాచారం జరిగింది
మానం మీద కాదు
“వీడిన మన మౌనం మీద”

( వాడి మౌనం ఎంత ప్రమాదమో…..మన మౌనం అంతకంటే ప్రమాదం మిత్రులారా ) మణిపూర్ మారణకాండను , భరతమాతలపై జరిగిన పైశాచిక అత్యాచార దాడులను తీవ్రంగా ఖండిద్దాం. ఉన్మాద రాజకీయాలను , వాటి సైద్ధాంతిక భావజాలాన్ని తిప్పికొడదాం.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *