ఎజ్జ రాజయ్య
➖తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
◆రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిన ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని అమలు చేయాలి


        పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంఘం జిల్లా కార్యాలయంలో 10-12-2023 ఆదివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రామగుండం కార్పొరేషన్  ప్రధాన కార్యదర్శి మునిగంటి సంపత్,టేల అధ్యక్షులు కోడిపుంజుల మదు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోడిపుంజుల చంద్రయ్య ,రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక,రాష్ట్ర కళామండలి అధ్యక్షులు ఎజ్జ రాజయ్య ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ నేటి ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి 2016 అసెంబ్లీ సమావేశంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చవలసిందేనని ఎమ్మెల్యే హోదాలో మాట్లాడిన మాటలను  నేడు ముఖ్యమంత్రిగా ఉన్న వారు మాటనిలబెట్టుకోవాలని అన్నారు.
    రామగుండం కార్పొరేషన్ ఉపాధ్యక్షులు గుండ్రాతి మల్లన్న మాట్లాడుతూ రజక కులస్తుల సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న నూతన ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి అభివృద్ధికి తోడ్పడాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వృత్తిదారులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *