ళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందచేసిన వరంగల్ పశ్చిమ ఏం.ఎల్.ఏ. నాయిని …

హన్మకొండ లోని అంబేడ్కర్ భవన్ లో ఈ రోజు కాజీపేట 47, 48, 61, 62, 63 డివిజన్ మరియు హన్మకొండ 31, 49 వ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు వరంగల్ పశ్చిమ ఏంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు.

ఈ సంధర్భంగా ఏంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజాకీయాలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అందిస్తుందని, ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు. ఈ నెల 15 వ తేదీ దాటితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నిధులు వెనక్కి వెలుతాయి కాబట్టే ఇంతమంది కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడనే ఉద్దేశంతోనే ఏం.ఆర్.ఓ గారు కార్పొరేటర్లు అందరూ కలిసి అత్యవసరంగా సమావేశపరిచి లబ్దిదారులకు చెక్కులు అంద చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, మాజీ కార్పోరేటర్ మహమ్మద్ అబూబాకర్, సయ్యద్ రజాలి, జిల్లా మైనారిటీ సెల్ ఛైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *