Mulugu newsMulugu news

మంత్రి సీతక్కకి ఘన స్వాగతం పలికిన జగ్గన్న పేట గ్రామ ప్రజలు
-మంత్రిగా తొలి సారి జగ్గన్న పేట గ్రామానికి వచ్చిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్కకి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

-ఢిల్లీకి రాజు అయిన తల్లీకి బిడ్డేనే

-నేను పుట్టిన గ్రామం రుణం తీర్చుకుంటా

-స్వగృహం లో తల్లీ తండ్రుల ఆశీస్సులు తీసుకున్న
మంత్రి వర్యులు సీతక్క.

మంత్రి హోదాలో శుక్రవారం రోజున ములుగు మండలంలోని మంత్రి స్వగ్రామం జగ్గన్న పేట గ్రామానికి వచ్చిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్కకి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను మీ ఆడ బిడ్డను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డను నేను పుట్టిన గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాపైన ఉందని ప్రజలు నాపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లను అమలు చేస్తామని ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని వాళ్ళు చేసుకోవాలని అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని మంత్రి వర్యులు సీతక్క అన్నారు
అనంతరం గ్రామ ప్రజలు శాలువాతో సత్కరించిన గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్య
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్స వడ్ల వెంకన్న
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్,
ఉప సర్పంచ్ సదానందం, అర్రెం వెంకన్న తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల,గ్రామ అధ్యక్షులు
ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *