ముంబైలో డిసెంబర్ 20 నుంచి 24 వరకు జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్ రావు( ఐటిసి రిటైర్డ్ ఎంప్లాయి ) అనే క్రీడాకారుడు బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు ఈ క్రీడాకారుడు గతంలో కూడా జాతీయస్థాయిలో నాలుగు బంగారు పథకాలను సాధించడం జరిగింది. ఈ బంగారు పథకాలు సాధించిన క్రీడాకారుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అభినందించడం జరిగింది. అంతేకాకుండా తర్వాత జరగబోయే ఇంటర్నేషనల్ పోటీల్లో కూడా రాణించాలని సూచించారు. అంతేకాకుండా భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవీ రామిరెడ్డి ని కూడా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు క్రీడా పరంగా పేరు తీసుకు వస్తున్నటువంటి రామిరెడ్డిని మరియు రామ్మోహన్ రావు ని అభినందించడం జరిగింది.
telugu galam news e69news local news daily news today news