telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

సూపర్ స్టూడెంట్స్ టి-సాట్ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బాలికలలు హైదరాబాదులో బుల్లితెరపై పాఠాలు బోధించి ఔరా అనిపించారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. మౌనిక తెలుగులో శతక పద్యం పాఠం బోధించగా, ఇంటర్ ఫస్టియర్ హెచ్ సి గ్రూప్ చదువుతున్న బి. జమున ఎకనామిక్స్ లో మనీ బ్యాంకింగ్ సిస్టం పాఠం బోధించింది. ఈ ఇరువురు బాలికల ప్రతిభను మెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల, సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రెటరీ కే. సీత లక్ష్మి, ఐ.ఏ.ఎస్ గారు,డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు ఈ బాలికలకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ విద్యార్థులను గురువారం గిరిజన గురుకులం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం. దేవదాసు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల టీచర్లు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *