telugu news local news daily news e69news telugu galam mulugu newstelugu news local news daily news e69news telugu galam mulugu news

చైర్మన్, డైరెక్టర్ లుగా నియమితులైన శుభదిన సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను అభినంధించి సన్మానించిన మండల కాంగ్రెస్ నాయకులు.
బుధవారం రోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ అధ్యక్షతనలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవ ఆలయ కమిటీ చైర్మన్ గా మాడుగురి ప్రసాద్ మరియు డైరెక్టర్ లు నియమితులైన కమిటీ సభ్యులను మండల కాంగ్రెస్ నాయకులు అభినందించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ ముఖ్యఅతిధులుగా హాజరైనారు.

ఈ సందర్బంగా ఆలయ కమిటీ చైర్మన్ మాడుగురి ప్రసాద్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను నియమించినందుకు అదేవిధంగా డైరెక్టర్ లుగా వలస తిరుపతి, దుర్గం కొమురయ్య,సోమంధపు నర్సింహులు,పెద్దబోయిన అర్జున్, చెన్నం లాలమ్మ,ఇర్సవడ్ల పూర్ణచందర్,ఇరవేణి రాంలాల్,కర్ల అరుణ,కట్కూరి రాధికా,గార పోషలు కమిటీ సభ్యులందరి తరుపున మంత్రి సీతక్కకి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతూన్నాము. ఈ మహాశివ రాత్రి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మనస్ఫూర్తిగా బాధ్యతలను సక్రమంగా, పటిష్టంగా నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోర్డినేటర్ & బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్,జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు, PACS వైస్ చైర్మన్ & మండల ఉపాధ్యక్షులు చెన్నూరి బాలరాజు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,మండల ఉపాధ్యక్షులు వీసం నర్సయ్య,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అప్సర్ పాషా,మండల మహిళా కోర్డినేటర్ గికూరు భాగ్య,మండల యూత్ అధ్యక్షులు గద్దల నవీన్, టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,మాజీ టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్,టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్,చిక్కుల మానస,కూరపాటి వేణు,ఇర్సవడ్ల కిరణ్, రతన్, హరికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *