citu news jangaon news local news telugn unewsసిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.వి.రమ

భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.వి.రమ

సిఐటియు ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ
~~~~
జనగామ: కార్మిక వ్యతిరేక మతోన్మాద బిజెపిని ఓడించాలని భువనగిరి సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ అన్నారు
గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక మతోన్మాద బిజెపిని ఓడించండి- లోక్ సభ ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులను గెలిపించండి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్సీ రమ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కార్మిక హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగ కార్మికులకు ఉందన్నారు భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎండి జాంగిర్ గారిని గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు
బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులపై దాడి పెరిగిందని 44 కేంద్ర కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసిందని నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను తీసుకొచ్చారని మండిపడ్డారు దేశ స్వాతంత్రానికి ముందు తర్వాత కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసారని విమర్శించారు బిజెపి 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ మోసం చేసిందన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం బిజెపి చేసిందని విమర్శించారు జీవిత బీమా ఎల్ఐసి జిఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వేలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదే రహదారులు విద్యుత్తు బొగుబావులు ఓడరేవులను విమానాశ్రయాలు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని అన్నారు దేశ సమైక్యతకు సార్వభౌమత్వానికి ఫెడరలిజానికి నష్టం చేసే విధానాలను బిజెపి అనుసరిస్తుందని దీని ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కార్మికుల హక్కులను కాపాడుకోవాలంటే భువనగిరి పార్లమెంట్ పరిధిలో సిపిఎం అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు జిల్లాఅధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ సిఐటియు జిల్లా నాయకులు జోగు ప్రకాష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *