jayashanker bhupalapally news local news teluug galam news congress news rahul gandhi newsఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
  • ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయండి
  • దేశం కోసం నెహ్రూ, ఇందిరా జైలుకు వెళ్లారు
  • రాహుల్ గాంధీ ది త్యాగాల కుటుంబం
  • మోదీ పాలనలో రూ.100 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు
  • వరంగల్ లో డాక్టర్ కడియం కావ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందాం
  • భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి, గొర్లవీడు, కొంపల్లి, ఎస్. యం కొత్తపల్లి గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
    గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
    దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విజ్ఞప్తి చేశారు.గురువారం రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే జీఎస్సార్ భూపాలపల్లి రూరల్ మండలంలోని నేరేడుపల్లి, గొర్లవీడు, కొంపల్లి, ఎస్. యం కొత్తపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. భూపాలపల్లి రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి రామచంద్రయ్య అధ్యక్షతన ఆయా గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశాలల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
    అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలల్లో ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ…. మన దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, ఇప్పుడు ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని కోరారు. దేశం కోసం నెహ్రూ, ఇందిరా జైలుకు వెళ్లారని, రాహుల్ గాంధీ ది త్యాగాల కుటుంబమని గుర్తు చేశారు. మోదీ పాలనలో సుమారు రూ.100 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని తెలిపారు. వరంగల్లో డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. వచ్చే ఆగస్టు 15న రుణమాఫీని అమలు చేస్తామని ప్రతీ మీటింగ్‌లో ముఖ్యమంత్రిచెప్తున్నప్పటికీ, కొందరు దాన్ని తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. అటువంటి వారికి ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు.
    ఈ సమావేశాలల్లో ఎమ్మెల్యే వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, భూపాలపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మార్క విజయ్ లతో పాటు ఆయా గ్రామాల ఇంచార్జీలు, గ్రామ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *