వ్యాస రచన-మర్యం అజీమ్,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ మహిళల శాఖ అధ్యక్షురాలు-93906 57594

ఈ69న్యూస్:- ఇస్లాం మతంలో రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన నెల.ఇది ఉపవాస దీక్ష(రోజా),ఖురాన్ పఠనం,నమాజు,దానం,మరియు క్షమాభిక్షతో నిండిన ఆధ్యాత్మికతకు ప్రతీక.ఈ మాసంలో ఖురాన్ అవతరించినందున దీనికి విశేష ప్రాముఖ్యత ఉంది.అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్‌ గ్రంధంలో “రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించబడింది.ఇది మానవాళికి మార్గదర్శకం,సజ్జనులకు స్పష్టమైన సంకేతాలతో కూడిన హితబోధన అని బోధించడం జరిగింది.(ఖురాన్ 2:185)అంటే,రంజాన్ మాసం కేవలం ఉపవాస దీక్ష కోసం మాత్రమే కాకుండా,ఖురాన్‌ను అవగాహన చేసుకోవడం,వాటి బోధనలను అనుసరించడం కోసం కూడా ఒక దివ్యమైన అవకాశం.రంజాన్ రోజులలో నేను నరక ద్వారములను మూసివేస్తాను సైతాన్ ను బంధిస్తాను స్వర్గ ద్వారాలను తెరుస్తాననీ అల్లాహ్ తాలా ఆదేశించెను.మహమ్మద్ ప్రవక్త ఇట్లు ఉపదేశించారు.విశ్వాస నిబంధనలను పాటిస్తూ పుణ్య లక్ష్యంతో రమజాన్ రాత్రుల్లో నిద్రలేచి నమాజ్ చదివిన వ్యక్తి గత పాపములు క్షమించబడును.ఉపవాసము(రోజా)రంజాన్ మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి.ఖురాన్‌లో అల్లాహ్ ఇలా చెప్పాడు.“ఓ విశ్వాసులారా మీరు ధార్మికులు కావాలనే ఉద్దేశంతో మీ కంటే పూర్వం ఉన్న వారికి విధింపబడినట్లే మీకు కూడా ఉపవాస నియమము విధించబడియున్నది.ఇస్లాం వ్యవస్థాపకులు ముహమ్మద్ ప్రవక్త(స.అ.వ)ఉపవాస దీక్ష ప్రాముఖ్యత గురించి“అల్లాహ్ ప్రీతి కొరకై పాటించే ఉపవాసానికి ప్రత్యేకమైన ప్రతిఫలం ఉంది.ఇది నరకానికి రక్షణ కవచంగా ఉంటుందని ఉపవాసి యొక్క నోరు నుంచి వచ్చే గాలి అల్లాహ్‌కు కస్తూరి వాసన కన్నా మధురంగా ఉంటుందని అన్నారు.”ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించబడినందున,ఈ మాసంలో దానిని ఎక్కువగా చదవడం,బోధనలను అవగాహన చేసుకోవడం అత్యంత శ్రేష్ఠమైన కార్యంగా ఇస్లాంలో భావిస్తారు.“ఈ ఖురాన్ మానవులకు మార్గదర్శకం.ఇది మంచి,చెడ్డ విషయాల మధ్య తేడాను స్పష్టంగా తెలియజేస్తుంది.”(ఖురాన్ 2:185)ముహమ్మద్ ప్రవక్త(స.అ.వ)ఖురాన్ గురించి ఇలా అన్నారు.“నిజంగా,ఖురాన్ చదివే ప్రతి అక్షరానికి పది రెట్లు ప్రతిఫలం లభిస్తుందని తెలిపారు.అదే విధంగా రంజాన్ మాసంలో అత్యంత పవిత్రమైన రాత్రి లైలతుల్ ఖద్ర్ (శ్రేష్ఠమైన రాత్రి).ఖురాన్ ఈ రాత్రిని గురించి ప్రత్యేకంగా వివరించింది.“నిశ్చయంగామేము ఖురాన్‌ను ఖద్ర్ రాత్రిలో అవతరింపజేశాము.ఈ రాత్రి వేయి నెలల కంటే గొప్పది! ఆ రాత్రి,దేవదూతలు తమ ప్రభువు అనుమతితో మొత్తము విషయములు తీసుకొని అవతరిస్తారు.ఉదయము వరకు శాంతి పరిస్థితియే ఉండును.ముహమ్మద్ ప్రవక్త భవిష్యవాణి ప్రకారం ఈ కాలపు వాగ్దాత హజ్రత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇట్లు ఉపదేశించారు.పవిత్ర ఖుర్ఆన్ శుభాలు,ప్రయోజనాలు సదా కొసాగుతున్నాయి.దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హయాంలో ఉన్నట్లే ప్రతి యుగంలో స్పష్టంగా ప్రకాశిస్తుంటాయి.కావున రమజాన్ లో పవిత్ర ఖుర్ఆన్ ను పఠించుటకు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లే దాని బోధనను ఆచరించుటకు కూడ ప్రయత్నించవలెను.రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేయడం చాలా ముఖ్యమైన ఆచారం.ఖురాన్‌లో అల్లాహ్ ఇలా అన్నాడు.“స్వంత అవసరాలు తీరిన తర్వాత,పేదలకు సహాయపడే వారు సజ్జనులే.”ముహమ్మద్ ప్రవక్త (స.అ.వ)జకాత్ గురించి“ధనవంతుల సంపదలో పేదులకు ఒక హక్కు ఉందని అన్నారు.రంజాన్ మాసంలో“ఎవరైతే భక్తి భావంతో రంజాన్ మాసాన్ని గడిపి,తన పాపాల నుండి విముక్తి కోరుతాడో,అతని గత పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు“రంజాన్ మొదటి దశ అల్లాహ్ కృపతో నిండి ఉంటుంది,రెండవ దశ పాపక్షమాభిక్షకు,మూడవ దశ నరక ముక్తికి అని ముహమ్మద్ ప్రవక్త బోధించారు.రంజాన్ మాసం పూర్తయిన తర్వాత,ఈద్-ఉల్-ఫిత్ర్ అనే పండుగను ముస్లింలు జరుపుకుంటారు.“ఈద్ పండుగలో ముస్లింలు కొత్త జీవితాన్ని ప్రారంభించి హృదయపూర్వక క్షమాభిక్ష కోరుకుని ప్రేమ,ఐక్యతతో ముందుకు సాగాలని ఈద్ పండుగలో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చేయాలి,ఇది పేదలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడుతుంది.రంజాన్ అనేది మానవత్వం,భక్తి,ఆత్మ నియంత్రణ,సహాయసేవ,దైవానుగ్రహాన్నిపొందే పవిత్ర సమయమనే సందేశం రంజాన్ మాసం మనకు ఇస్తుందని అర్థమవుతుంది.అల్లాహ్ మన అందరికీ ఇలాంటి ఈ పవిత్ర మాసాలు మరెన్నో సమర్థవంతంగా గడిపే శక్తిని ప్రసాదించుగాక! ఆమీన్-

*వ్యాస రచన-మర్యమ్ అజీమ్,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ మహిళల శాఖ అధ్యక్షురాలు-93906 57594*

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *