పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేపోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి భూమిపూజ,శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు, అధికారులు అందరి సహకారంతోనే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు.అదేవిధంగా గాంధీనగర్ నుండి జంగాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 కోట్ల నిధులు,హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు రూ.18 కోట్ల నిధులతో సీడీఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోటగుళ్ళు,రెడ్డిగుళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.త్వరలోనే కాటేజిలతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.స్టేషన్ ఆవరణలో 2 ఎకరాల స్థలం ఉందని అందులో పోలీసుల కొత్త క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు,గణపురం సర్కిల్ సీఐ కరుణాకర్ రావు,గణపురం ఎస్సై అశోక్,వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *