రామగుండాలపల్లిలో సర్పంచ్ గా ఎడెల్లి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణరామగుండాలపల్లిలో సర్పంచ్ గా ఎడెల్లి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ

ముఖ్య అతిథిగా పాల్గొన్న మిషన్ భగీరథ ఏఈఈ వెన్నెల
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని రామగుండాలపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఎడెల్లి మోహన్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది.సర్పంచ్ ఎడెల్లి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకరణ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఏఈఈ వెన్నెల,గ్రామ కార్యదర్శి కొమ్మలు లను రామగుండాలపల్లి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో అధికారులు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులు కూడా పదవి బాధ్యతలు చేపట్టారు.
గ్రామ పాలకవర్గం వివరాలు ఇలా ఉన్నాయి:
సర్పంచ్ – ఎడెల్లి మోహన్ రెడ్డి
ఉప సర్పంచ్ –మామిడి కవిత
వార్డు సభ్యులు:
1వ వార్డు – మడప విష్ణువర్ధన్
2వ వార్డు – గుడి కందుల విష్ణు
3వ వార్డు – ఆల్లం శిరీష
4వ వార్డు – మామిడి కవిత
5వ వార్డు – మామిడి శ్రీకాంత్
6వ వార్డు – ముడుతనపల్లి వనజ
ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు కట్కూరి విష్ణు,గ్రామ అధ్యక్షులు ముడితనపల్లి రాజు, గణపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడెల్లి మల్లారెడ్డి, దుంపల మోహన్ రెడ్డి,ఎడెల్లి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని నూతన సర్పంచ్‌కి మరియు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *