సర్పంచ్‌లు,పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణసర్పంచ్‌లు,పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకరణ

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి టేకుమట్ల/మొగుళ్లపల్లి
టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామం,మొగుళ్లపల్లి మండలంలోని మొగుళ్లపల్లి,ఇస్సిపేట గ్రామాలలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవి ప్రమాణ స్వీకరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు మరియు వార్డు సభ్యులతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుఅధికారికంగా పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలకవర్గం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని సూచించారు.గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్య రంగాల్లో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.పాలనలో పారదర్శకత, నిజాయితీ ఉండాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నూతన సర్పంచ్‌లు మరియు పాలకవర్గ సభ్యులకు సూచించారు.కార్యక్రమం అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ని శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *