సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామ నూతన సర్పంచ్ గా పెండ్లి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ స్పెషల్ ఆఫీసర్ యూ శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ప్రజల నమ్మకానికి ప్రతీకగా యువ నాయకుడిగా గ్రామ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీనివాస్ రెడ్డి ప్రజల నమ్మకంతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడిగా మంచి పేరు ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే గ్రామస్తులు గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి, గ్రామ సీనియర్ నాయకులు రాంపెల్లి వీరంజి గౌడ్, పెండ్లి మహేష్ రెడ్డి, పెండ్లి వెంకట్ రెడ్డి,యల్దీ అశోక్, దిద్ది వీర సోములు, బోర హరీష్, దిద్ది చంద్రశేఖర్, రాంపెల్లి శ్రీను, రంజిత్ గౌడ్, జక్కోజు సురేష్, చింత రమేష్,రాంపురం గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *