అల్లరి రాజకీయాలకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యేఅల్లరి రాజకీయాలకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే

ప్రజా మద్దతు కోల్పోయి దిష్టిబొమ్మల దహనానికి దిగజారుడు చర్యలు

దళిత బంధు పేరుతో వసూళ్లు-అసలైన దళిత ద్రోహి రాజయ్య

నియోజకవర్గ అభివృద్ధికే కడియం శ్రీహరి కృషి

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో స్టేషన్ ఘన్‌పూర్‌కు వందల కోట్ల నిధులు

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కనకం రమేష్ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దళితుల పేరుతో కావాలనే అలజడి సృష్టిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కనకం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రాజకీయ లబ్ధి కోసం దళితులను ముందు పెట్టి నియోజకవర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.పది మంది దళితులను వెంటబెట్టుకుని కావాలనే విభేదాలు రెచ్చగొట్టడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.ఇలాంటి చర్యల వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని హెచ్చరించారు.గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమైన,సంఘవిద్రోహ చర్యగా కనకం రమేష్ అభివర్ణించారు.ప్రజాస్వామ్యంలో ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యకు పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోయినందుకే ఇలాంటి అల్లరి రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.దళిత బంధు పథకం పేరుతో దళితుల వద్ద ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి,ఇప్పటివరకు ఆ డబ్బులు గానీ,పథకం లాభాలు గానీ అందించలేదని తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంలో తాటికొండ రాజయ్య అసలైన దళిత ద్రోహి అని వ్యాఖ్యానించారు.నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు.కడియం శ్రీహరి రాజకీయ జీవితం మొత్తం ప్రజల సంక్షేమం,అభివృద్ధికే అంకితమైందని కొనియాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేస్తోందని కనకం రమేష్ వెల్లడించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *