తాళ్లూరి నర్సింహా రావు పోరాట స్ఫూర్తి నేటి తరం యువత కు ఆదర్శంతాళ్లూరి నర్సింహా రావు పోరాట స్ఫూర్తి నేటి తరం యువత కు ఆదర్శం

బుద్ధారం గ్రామానికి చెందిన సిపిఎం మండల సీనియర్ నాయకులు తాళ్లూరి నరసింహారావు పోరాట స్ఫూర్తి నేటి తరం యువత కు ఆదర్శం అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. మండలం లోని బుద్ధారం క్రాస్ రోడ్ లో నరసయ్య స్తూపం వద్ద నర్సయ్య 13వ వర్ధంతిని గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్బంగా నర్సయ్య స్తూపం వద్ద జెండా ను సీనియర్ నాయకులు దాసరి వీరయ్య, అమరజీవి వంకుడోత్ బాణీయ స్తూపం వద్ద అయోధ్య లు పార్టీ జెండా లను ఎగురవేయాగా, నర్శయ్య చిత్ర పటానికి అంబటి వీరా స్వామి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ వర్ధంతి సభలో సిపిఎం మండల నాయకులు వి. పి. వెంకటేశ్వర్లు, ఇమ్మడి గోవింద్, మల్లెల నాగమణి,సి హెచ్. ఎల్లయ్య, సి హెచ్. మౌనిక, ఏ. రామకృష్ణ,ఎస్. కె. మౌలానా,జి. వీరభద్రం సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల నాయకులు నంద్యా, వి.శంకర్, లక్ష్మణ్, శంకర్, జడ శ్రీను, అశోక్, పూర్ణ,మల్లయ్య, ప్రవీణ్, సర్వర్, పద్మ, సుజాత, ప్రజలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *