పగడాల నాగరాజు ను పరామర్శించినజిల్లా BRS నాయకులుపగడాల నాగరాజు ను పరామర్శించినజిల్లా BRS నాయకులు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి సిట్ విచారణతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద వైఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BRS ఇచ్చిన నిరసన పిలుపుమేరకు ఖమ్మం పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొని నిరసన తెలియజేస్తున్న సందర్భంలో జరిగిన తోపులాటలో పోలీస్ అధికారులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ చేయటం జరిగింది.

గత మూడు రోజుల నుంచి ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న పగడాల నాగరాజును శుక్రవారం జిల్లా BRS నాయకులు తోట రామారావు ములాఖాత్ సందర్శనలో భాగంగా ఈరోజు వారిని కలిసి మేమంతా ఉన్నాం అన్న ధైర్యాన్ని కల్పించి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది.

ఈ ములాఖాత్ కార్యక్రమంలో మాజీ కాన్సిల్ సభ్యులు వంగాల వెంకట్, డివిజన్ అధ్యక్షులు చేతి కృష్ణ, కిషన్ నాయక్,బాబా,నరసింహారావు, పెంటు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *