పోలింగ్ విధులపై పిఓలు, ఏపివోలకు అవగాహనపోలింగ్ విధులపై పిఓలు, ఏపివోలకు అవగాహన

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పిఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏపివోలు) కు సంబంధించిన రెండో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ,ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన ప్రధాన బాధ్యత పిఓలు,ఏపివోలదేనని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఎదురయ్యే వివిధ పరిస్థితులు,ఓటింగ్ యంత్రాల నిర్వహణ విధానం, పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, ఎన్నికల నిబంధనలపై అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సక్రమంగా పోలింగ్ నిర్వహించాలని, చిన్నపాటి తప్పిదాలు కూడా జరగకుండా అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఆమె సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోనా, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *