కార్మిక కర్షిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలికార్మిక కర్షిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలి

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షిక వ్యతిరేక విధానానికి నిరసనగా జాతీయ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తల్లాడ పట్టణంలో భారీ కార్మిక ప్రదర్శన స్థానిక పత్తి మార్కెట్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించడం జరిగింది అనంతరం బస్ స్టాండ్ ఆవరణంలో జరిగిన నిరసన సభ కార్యక్రమం సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు టి యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా ముఖ్య అతిథులుగాపాల్గొని ప్రసంగిస్తూ
కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దు చేసిన. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోర్టులుగా 6సంవత్సరాల క్రితం మార్చిందన్నారు .దేశవ్యాప్త కార్మిక వర్గ ప్రతిఘటన ఫలితంగా నేటి వరకు అమలు చేయలేదన్నారు. 2025 నవంబర్ 21న లేబర్ కోడులను అమలుకు నోటిఫికేషన్ ఇచ్చి అమలుకు పూనుకుందన్నారు. అలాగే గత శీలకాల పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయాన నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి VB G – రామ్ జి స్కీమ్ గా మార్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందన్నారు. దేశంలో గల 40 కోట్ల సంగటిత అసంఘటిత రంగ కార్మికులను. శ్రమజీవులపై చావు దెబ్బ కొట్టింది అన్నారు . దేశ విదేశీ యజమానులకు(కార్పొరేట్లకు) అనుకూలంగా కార్మిక చట్టాలు మార్చింది అన్నారు కార్మికుల శ్రమజీవుల హక్కులను ఒక్కొక్కటి తొలగిస్తున్నారని అందులో భాగమే 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ గా మార్చారు ఇది కార్మికులకు నష్టకరమైనది కేంద్రంలోని నరేంద్ర మోడీ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయి అన్నారు కానీ కార్మికుల నిజ వేతనాలు పెరగలేదన్నారు కార్మికులకు ఉద్యోగ ఆరోగ్య భద్రత కరువైందన్నారు. నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలను. పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు తాతభాస్కరరావు నల్లమోతు మోహన్ రావు షేక్ మస్తాన్ సత్తెనపల్లి నరేష్ చిర్రా లింగయ్య తాళ్ల రాణి టి యు సి ఐ నాయకులు డి రమణ రాఘవ సిహెచ్ నరేష్ టి శ్రీను రాఘవ వెంకటేశ్వర్లు రమేష్ హమాలి సంఘం నాయకులు జి కృష్ణ డి కృష్ణయ్య రైతులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *