జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్- నూతన కార్యదర్శికి సన్మానంజాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్- నూతన కార్యదర్శికి సన్మానం

జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్- నూతన కార్యదర్శికి సన్మానం
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2
వరంగల్ జిల్లా :పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి మెటీరియల్స్ పంపిణీ చేశారు. గ్రామానికి నూతనంగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం స్థానిక యూపీఎస్ పాఠశాల ఆవరణలో జెండా ఆవిష్కరించి,బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను బడికి పంపాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గొడుగు యాకంత, వార్డు సభ్యులు గాడి పెళ్లి రాజబాబు,ముంజపల్లి నాగరాజు,రాపోలు అనిత, కొండేటి కొమరమ్మ,రామచంద్ర,దొంతమాల పవన్ కళ్యాణ్, బత్తిని జలంధర్, రామకృష్ణ,పస్తం రాధిక,గ్రామస్తులు సాంబయ్య,సాయిలు,కేదారే మహేందర్, పంచాయతీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *