త్రివేణి టాలెంట్ స్కూల్ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు
శేరిలింగంపల్లి,తెలుగు గళం న్యూస్: నియోజకవర్గంలోని త్రివేణి టాలెంట్ స్కూల్ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు, గోపికల వేషధారణలో బాలికలు సందడి చేశారు. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకన్నాయికృష్ణాష్టమిని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బాలురు నెమలిపింఛం, వేణువుతో శ్రీకృష్ణుడి వేషధారణలో ముస్తాబై ఆకట్టుకోగా.. బాలికలు గోపికల వేషధారణలో సంప్రదాయ దుస్తులతో అలరించారు. చిన్నారుల వేషధారణలు, హావభావాలు, ఆటపాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చచ్చాయిశ్రీకృష్ణుడి బాల్య లీలలు, గోపికలతో కృష్ణుడి అనుబంధాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థుల ప్రతిభను చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. అవగాహనవిద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రత్యేకంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. చదువుతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
వేడుకల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
