
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో ఉద్రిక్తత
తెలుగు గళం న్యూస్ నర్సింహులపేట సెప్టెంబర్ 15
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని మధుర వైన్స్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వైన్స్ నిర్వాహకులు యాకయ్య, స్వాతి దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసనకు దిగారు.తమ బెల్ట్ షాపుపై అబ్కారీ అధికారులు దాడి చేసి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని దంపతులు ఆరోపించారు. వైన్స్ షాప్ నిర్వాహకుల అనుమతితోనే మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని వారు పేర్కొన్నారు.అలాంటప్పుడు తమపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తమకు న్యాయం చేయాలని అబ్కారీ అధికారులను కోరుతూ ఆందోళన చేపట్టారు.ఘటనతో వైన్స్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.