
హనుమకొండ సెప్టెంబర్ 15 (ఈ69 న్యూస్)
నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది.సుబేదారి నాయుడు కుండా బిర్యానీ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి డివైడర్ మధ్యలోని చెట్టుకు ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం.రహదారి మధ్యలో వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది.వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.