ఇంటి నంబర్‌ 4-15 వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి

పంచాయతీ రికార్డులు,అసెస్‌మెంట్‌ వివరాలు పరిశీలించాలి

కలెక్టర్‌,ఎంపీడీవో తక్షణమే స్పందించాలి

సమాచార హక్కు పరిరక్షణ కమిటీ డిమాండ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌,సెప్టెంబరు 19(E69NEWS)

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలోని ఇంటి నంబర్‌ 4-15, 4-15/1, 4-15/2, హౌస్‌ ట్యాక్స్‌ అసెస్మెంట్ నెంబర్ 563కు సంబంధించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది.పంచాయతీ రికార్డులు,పన్ను రసీదులు,ఇంటి నంబర్ల కేటాయింపు విధానం,సంబంధిత రిజిస్ట్రేషన్‌ పత్రాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరింది.ఒకే నంబర్‌కు పలు సబ్‌ నంబర్లు
ఒకే ఇంటి నంబర్‌కు 4-15/1, 4-15/2 వంటి సబ్‌ నంబర్లు ఏ నిబంధనల ప్రకారం కేటాయించారో అధికారులు స్పష్టం చేయాలని కమిటీ కోరింది. ఖాళీ స్థలాలు లేదా నిర్మాణంలో ఉన్న స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించారా?గతంలో ఉన్న నంబర్లలో మార్పులు ఎందుకు చేశారు? ఎవరికి,ఏ దరఖాస్తు ఆధారంగా నంబర్లు కేటాయించారు? సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరపాలని పేర్కొంది.
*కార్యదర్శి పాత్రపై విచారణ అవసరం*
ఇంటి నంబర్ల కేటాయింపు,మార్పులు,సబ్‌ నంబర్ల ఏర్పాటు,హౌస్‌ ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌,పన్ను రికార్డుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి కార్యాలయం ద్వారా జరిగిన ప్రక్రియను పూర్తిగా పరిశీలించాలని కమిటీ కోరింది.ఇదే విధంగా గ్రామంలోని ఇతర ఇళ్లు,స్థలాలకు నంబర్లు కేటాయించిన విధానాన్ని కూడా అధికారులు పరిశీలించాలని పేర్కొంది.ప్రతి ఇంటి నంబర్‌కు దరఖాస్తు,స్థల పరిశీలన,అసెస్‌మెంట్‌,పంచాయతీ రికార్డు,అధికారిక అనుమతి,మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయా? అనే అంశాలను రికార్డుల ఆధారంగా నిర్ధారించాలని డిమాండ్‌ చేసింది.అసలు రికార్డులు బయటపెట్టాలి
జిల్లా కలెక్టర్‌,ఎంపీడీవో, సంబంధిత పంచాయతీరాజ్‌ అధికారులు అసెస్మెంట్ నెంబర్ .563 అసలు రికార్డులు,పన్ను రసీదులు,ఇంటి నంబర్‌ కేటాయింపు దరఖాస్తులు,పంచాయతీ తీర్మానాలు,స్థల పరిశీలన నివేదికలు,నంబర్ల మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు,సంబంధిత రిజిస్ట్రేషన్‌ పత్రాలను పరిశీలించాలని కమిటీ కోరింది.విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు లేదా సబ్‌ నంబర్లు కేటాయించినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.రికార్డుల వల్ల రైతుకు లేదా సంబంధిత వ్యక్తికి నష్టం జరిగినట్లు తేలితే,చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని కోరింది.నిర్లక్ష్యం చేస్తే సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర,జాతీయ కమిటీల దృష్టికి తీసుకెళ్లి
ఈ అంశంపై జిల్లా స్థాయిలో సమగ్ర విచారణ జరపకుండా నిర్లక్ష్యం కొనసాగితే, అందుబాటులో ఉన్న ఆధారాలతో రాష్ట్ర, జాతీయ కమిటీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి తదుపరి చట్టబద్ధమైన చర్యలు చేపడతామని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.ప్రజల హక్కుల పరిరక్షణ,రైతులకు న్యాయం,ప్రభుత్వ రికార్డుల్లో పారదర్శకత కోసం ఇంటి నంబర్‌ 4-15 వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కాట కుమారస్వామి, జనగామ జిల్లా అధ్యక్షులు జావిద్‌ ఖాన్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు
శ్రీధర్‌ కేసోజు లు డిమాండ్ చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *