
500 మంది భక్తుల పాల్గొనడం.. ఘనంగా అన్నప్రసాద వితరణ
హనుమకొండ (ఈ69న్యూస్) సెప్టెంబర్ 24
హన్మకొండ జిల్లా మడికొండలోని మెట్టు రామన్న కాలనీలో తెలంగాణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 17వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు, సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.కమిటీ ప్రెసిడెంట్ పైడిపాల రవీందర్-మాధవి దంపతులు మరియు కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారుగా 500 మంది భక్తులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు K. రవి, A. సత్యనారాయణ, D. సురేష్, P. మురళి, T. రవికుమార్, శాతబోయిన రాజు, D. చంద్రమౌళి, M. వేమన, G. చక్రపాణి, M. చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.