
ఈ69న్యూస్ హనుమకొండ, తేది: 26-09-2026
“బిగ్ బటర్‌ఫ్లై మంత్” కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు కాకతీయ జూలోజికల్ పార్క్, హంటర్ రోడ్, వరంగల్ లో “బటర్‌ఫ్లై వాక్” కార్యక్రమం ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ మరియు హన్మకొండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ బటర్‌ఫ్లై వాక్ ద్వారా సీతాకోకచిలుకలు పర్యావరణ సమతుల్యతలో పోషించే పాత్ర, పరాగసంపర్కం (పాలినేషన్), జీవ వైవిధ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యం గురించి పాల్గొన్న వారికి అవగాహన కల్పించబడింది. వివిధ రకాల సీతాకోకచిలుకలు, వాటి జీవచక్రం, నివాసాలు మరియు వాటి సంరక్షణ అవసరంపై వివరాలు తెలియజేయబడినాయి.

ఈ కార్యక్రమం అడవి శాఖ అధికారుల సమన్వయం మరియు సహకారంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ అధ్యక్షులు ఇందారం నాగేశ్వరావు గారు మరియు జిల్లా అటవీ అధికారి ముకుంద రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. గారు, జూ ఎఫ్.ఆర్.ఓ. శ్రీనివాస్ గారు మరియు అటవీ శాఖ, జూ సిబ్బందికి వారి సహకారం, ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యువతలో ప్రకృతి సంరక్షణ పట్ల చైతన్యం పెంచడానికి ఇవి ఎంతో దోహదపడతాయని ఈ సందర్బంగా అవగాహన కలిగేలా తెలియచేసారు.
