ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ సెప్టెంబర్ 26

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శిగా ఎన్నికైన మారేడుపాక ఉమాశంకర్‌ను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దిగోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఉమాశంకర్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు మారేడుపాక మోహన్ బాబు, సంఘం సభ్యులు దిగోజు రాజేష్, కాశోజు రవి, కాశోజు శ్రీను, కేశోజు రమేష్, మారేడుపాక రమేష్, కొండోజు శ్రీనాథ్, మారేడుపాక రాజు, మారేడుపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *