
ఐదు వారాలైనా పరిష్కారం కాని 50 సమస్యలు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సీపీఎం
ఈ69న్యూస్ చిల్పూర్, అక్టోబర్ 5
జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో గత ఐదు వారాలుగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన సుమారు 50 దరఖాస్తులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ఉపాధి హామీ పథకం బిల్లులు తదితర సమస్యలపై నిరుపేదలు, రైతులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. అయితే దరఖాస్తులు ఇచ్చి ఐదు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.దీంతో ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 50 దరఖాస్తులను పరిశీలించి, 15 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరాల రాకేష్ పాల్గొన్నారు.