
హనుమకొండ (ఈ69న్యూస్) అక్టోబర్ 5:
కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీ దుర్గా శక్తి యూత్ ఆధ్వర్యంలో కర్ర పూజ వేడుకగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ యువకులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి కర్ర పూజను ఘనంగా నిర్వహించారు.గ్రామంలో సాంప్రదాయాలు, ఆచారాలను కొనసాగిస్తూ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో ఆవాల రాధికా రెడ్డి, పల్లపు మధు, అర్జున్, మహేష్, రాజేందర్, దువ్వ శ్రీకాంత్, వస్కుల శంకర్, నాగరాజు, రొడ్డ దయాకర్, ఆకుతోట ప్రశాంత్, బిళ్ళ రవి, వెన్నమాల రమేష్, ఓర్సు రాజు తదితరులు పాల్గొన్నారు.