ఇసుక లారీ బీభత్సం.. CRPF జవాన్ మృతి
వరుసగా రెండు వాహనాలను ఢీకొన్న లారీ.. పలువురికి గాయాలు

ఈ69న్యూస్ ములుగు అక్టోబర్ 08
ములుగు జిల్లా పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఇసుక లారీ ముందుగా CRPF వాహనాన్ని ఢీకొనడంతో ఓ CRPF జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
అనంతరం అదే లారీ పస్రా వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాడ్వాయి MPDO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఏటూరునాగారానికి చెందిన రమేష్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం.ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.